GNTR: తెనాలి మండలం పెదరావూరులోని పెట్రోల్ బంక్లో తహసీల్దార్ గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు. జంపని రోడ్డులోని భారత్ పెట్రోలియం బంకులో ఇబ్బందులపై ఫిర్యాదులు రావడంతో ఆయన అక్కడకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. బంక్ యాజమాన్యంతో పాటు సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ సమయంలో మీటర్ల పనితీరును పర్యవేక్షించారు.