‘జై భీమ్’ వంటి క్లాసిక్ అందించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో సూర్య మరో సినిమా చేయనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా కేవలం రూ.5 ఫీజుతో పేదలకు వైద్యం అందించి, పద్మశ్రీ అందుకున్న ప్రముఖ చెన్నై ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం బయోపిక్ అని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.