AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుండగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం మధ్యలోనే అత్యవసరంగా మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మ.1:30 గంటల వరకు సచివాలయంలోనే ఉండాల్సి ఉంది. అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ, దీనికి కారణాలు తెలియరాలేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.