VZM: సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్తవలస రైల్వే స్టేషన్ను జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ గురువారం సందర్శించారు.స్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారుడును ఆదేశించారు. గతంలో ఆగిన రాయగడ గుంటూరు, కోర్బా విశాఖపట్నం రైళ్ళను పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.