KMM: పొలాల్లో జిలుగు విత్తనాలు చల్లడం ద్వారా భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందని సిద్ధినేనిగూడెం సొసైటీ ఛైర్మన్ కటికల సీతారాం రెడ్డి అన్నారు. గురువారం మధిర మండలం సిద్దినేనిగూడెం సొసైటీ కార్యాలయంలో రాయితీతో కూడిన జిలుగు విత్తనాలను సొసైటీ చైర్మన్ రైతులకు పంపిణీ చేశారు. సొసైటీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.