AKP: టీడీపీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర సూచించారు. అనకాపల్లి పట్టణం గవరపాలెం 81వ డివిజన్ పరిధిలో పార్టీ క్లస్టర్ యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా సవరణపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.