AP: అమరావతిలో జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖకు వచ్చిన అవార్డులను అధికారులు చూపించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని శాఖలు అదే స్ఫూర్తితో పనిచేయాలని సీఎం మంత్రులకు సూచించారు. ఈ సమావేశంలో రెండేళ్లలో సాధించిన విజయాలు, అభివృద్ధిపై చర్చ జరిగింది.