PDPL: ధర్మారం మండలం రచ్చపల్లి, కానంపల్లి, కటికనపల్లి, ధర్మారం ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ప్రభాకర్ ఇవాళ తెలిపారు. ఇన్స్ట్రక్టర్ 10+2, బాల్య విద్య/ ప్రాథమిక బోధనలో శిక్షణ, ఆయా 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అర్హత గలవారు స్కూల్ కాంప్లెక్స్ HM కు జూన్ 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.