BDK: టేకులపల్లి మండలం లచ్చుగుడం గ్రామపంచాయతీని గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా వర్షాకాలం రానున్న నేపథ్యంలో నీరు నిలువ లేకుండా ట్రైన్ మరియు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వారిని కోరారు. ఎమ్మెల్యే సహకారంతో అతి త్వరలోనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు.