NRML: కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరి ధాన్యం సేకరణను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల్లోని లారీలు, హమాలీలను అవసరమైన కేంద్రాలకు తరలించాలన్నారు.