SKLM: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ ఆరోపించారు. గురువారం పోలాకి, నరసన్నపేటలో చంద్రబాబు ఇచ్చిన హామీ పత్రాలను ఆయన తగులబెట్టారు. అనంతరం నరసన్నపేటలోని వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. గడిచిన రెండేళ్లలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు.