KRNL: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైసీపీ నేతలు ఇవాళ పెద్దకడబురు బస్ స్టాండ్ నందు రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తం రెడ్డి, మండల నాయకులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ధర్నా నిర్వహించారు. కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలైందని నాయకులు విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.