NRML: ఇటీవల వాహన ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు పోశెట్టిని గురువారం యూనియన్ జిల్లా నాయకులు ఆయన నివాసంలో పరామర్శించారు. జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.