TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, సస్పెండెడ్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట సహా 15 చోట్ల సోదాలు చేసి రూ.5.92 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. వీటికి లెక్కలు చూపకపోవడంతో ఆయనను అరెస్ట్ చేశారు.