AKP: మాకవరపాలెం మండలం రాచపల్లి పరిధిలో పరిశ్రమల కోసం తీసుకున్న 406 ఎకరాల భూమికి 100 అడుగుల రోడ్డు ఏర్పాటుకు సర్వే ప్రారంభించారు. చిన్న రాచపల్లి గ్రామం నుంచి భీమ బోయినపాలెం మెయిన్ రోడ్డుకి వంద అడుగుల రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 3 రోజులుగా సర్వే పనులు చేపట్టారు. రైతులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.