AP: వైసీపీ రాక్షస పాలన విముక్తికి రెండేళ్లు అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘గొడ్డలి పార్టీ రాజకీయాలకు 2024 ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడారు. వైసీపీ నిరసనలు ప్రజల తీర్పును అవమానించే చర్య. జగన్ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. పరిశ్రమలను తరిమేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది’ అని పేర్కొన్నారు.