AP: వైసీపీ బందిపోటు పాలన నుంచి విముక్తి కలిగి నేటికి రెండేళ్లు అని మంత్రి DSBV స్వామి పేర్కొన్నారు. ‘బందిపోటుల్లా ఐదేళ్లు రాష్ట్రాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారు. వైసీపీ నేతలు నేడు వెన్నుపోటు అంటూ నిరసనలు చేయడం సిగ్గుచేటు. వెన్నుపోటుకు, గొడ్డలిపోటుకు పేటెంట్ హక్కు వైసీపీదే. హమీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగనే’ అని విమర్శించారు.