కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి గురువారం రాజానగరం మండలం కానవరం వాస్తవ్యులు వీరాతి వీర వెంకట సత్యనారాయణమూర్తి, దేవి వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటం అందజేశారు