BDK: అశ్వారావుపేటలోని సబ్ స్టేషన్ ఆవరణలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏడీఈ వెంకట రత్నం తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే సదస్సులో సీజీఆర్ఎఫ్ ఛైర్ పర్సన్ వేణుగోపాలాచారి పాల్గొని విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.