NZB: నవీపేట్ మండలం ఫకీరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గణేశ్ నిర్మాణంలో ఉన్న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ ఉదయం స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.