ASR: గిరిజన ప్రాంతంలో గిరిజనేతరుల అక్రమ కట్టడాలను తొలగించాలని పెసా కమిటీ హుకుంపేట మండల అధ్యక్షుడు చప్పలి శంకరరావు, ప్రధాన కార్యదర్శి జన్ని వెంకటరమణ కోరారు. బుధవారం హుకుంపేట జాయింట్ కలెక్టర్ శ్రీపూజకు ఫిర్యాదు చేశారు. మండలంలో పెసా కమిటీ కార్యాలయం మంజూరు చేయాలన్నారు. కమిటీకి ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. సభ్యులకు నెలసరి జీతభత్యాలు చెల్లించాలన్నారు.