NDL: పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం నంద్యాలలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె పర్యావరణ పరిరక్షణ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.