TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన వెంకటాద్రి, నార్లాపూర్ రిజర్వాయర్లు, ఎల్లూరు పంప్‌హౌస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సాయంత్రం సోమశిలలో ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి పథకంతో పాటు పలు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించి, రాత్రికి అక్కడే బస చేయనున్నారు.