BPT: అద్దంకి పట్టణంలోని రామ్‌నగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో నాగులపాడుకు చెందిన సంతోష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని సంతోష్ తన బైక్‌తో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అతడిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.