PPM: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ (ఐపీఏఎస్ఈ)-2026లో భాగంగా జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 7 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు. బుధవారం తెలిపారు. ప్రాక్టికల్ ఫీజులను చెల్లించిన విద్యార్థులకు సంబంధించి పరీక్ష కేంద్రాలను ఖరారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.