RR: ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడా సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కారణంగా రహదారి పక్కన నిలిపి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో నందిగామ మండలం అప్పరెడ్డిగూడాకు చెందిన కార్తీక్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలు కాగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.