PPM: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు కారుణ్య నియమాకాలు చేపట్టడం ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని కలెక్టర్, పార్వతీపురం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి డా, ప్రభాకరరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పురపాలక కమిషనర్ పావనితో కలిసి యమునకు లైబ్రేరియన్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు.