TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 7న ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం జరగనుంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. నగరంలోని సైక్లింగ్, క్రీడా ప్రేమికులు ఈ ప్రత్యేక ఆదివారం వేడుకలో పాల్గొనాల్సిందిగా కోరారు.