ATP: జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సగటున 1.1 మిమీగా నమోదైంది. గుంతకల్లు మండలంలో అత్యధికంగా 18.4 మిమీ వర్షం కురిసింది. ఉరవకొండలో 6.0 మిమీ, బొమ్మనహాళ్లో 4.4 మిమీ, విడపనకల్లో 4.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.