KMR: మాచారెడ్డి X రోడ్ ప్రాథమిక పాఠశాలలో సమ్మర్ క్యాంపు కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ సిబ్బంది బుధవారం సాయంత్రం సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ మోసాలు,ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కే. విజయలక్ష్మి, పోలీస్ విభాగం, సఖి డిపార్ట్మెంట్, పాల్గొన్నారు.