KRNL: ఉరుకుందలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో ఇవాళ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించిన స్వామి వారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. అలంకరణలో స్వామి వారి దివ్యరూపం భక్తులను ఆకట్టుకుంది.