మహబూబ్నగర్: నేటి నుంచి ఈనెల పదవ తేదీ వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నాలుగు రోజులు సాలిడ్ టెస్ట్, వర్షపు నీటి వినియోగం, ప్రత్యేక శానిటేషన్, కొత్త ఓటరు నమోదు పై అవగాహన కల్పిస్తామన్నారు.