PDPL: ఐక్య పోరాటాలతో కార్మికుల హక్కులను సాధించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. బుధవారం రామగుండంలో ఈనెల 13, 14 తేదీలలో ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశానికి సంబంధించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సింగరేణిలో లేబర్ కోడ్లను అమలు చేస్తూ కార్మికుల హక్కులను హరించి వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.