VZM: ఖరీఫ్ సీజన్ కోసం పకడ్బందీగా ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి రైతును దృష్టిలో పెట్టుకొని రైతు సేవా కేంద్రం, గ్రామ మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు.