ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నాయకులు బుధవారం సమావేశమయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష మాట్లాడుతూ.. సమిష్టి ఉద్యమాలతోనే బీసీలు తమ హక్కులను సాధించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలు రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు.