అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో 18 ఏళ్ల యువతి బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఒంగోలుకు చెందిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తంబళ్లపల్లెలో భవన నిర్మాణ పనులు చేస్తోంది. గర్భం విషయాన్ని కుటుంబానికి తెలియకుండా ఉంచినట్లు సమాచారం. శిశువును తమ వద్ద ఉంచుకోలేమని తల్లిదండ్రులు చెప్పడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.