JGL: గ్రామీణ మహిళలు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని, సెర్ఫ్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సునీత అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఎంబ్రాయిడరీ శిక్షణ తరగతులను బుధవారం ఆమె సందర్శించారు. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి సాధించాలని సూచించారు. సెర్ప్, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు అవసరమైన రుణ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.