మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాలకు బీజేపీ పార్టీ మండల ఇంఛార్జ్లుగా నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు ఆయా మండలాల్లో జరిగే విధంగా నూతన ఇంఛార్జ్లు కృషి చేయాలని ఆదేశించారు.