ADB: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని ఆదిలాబాద్ వన్ టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని రవీంద్ర నగర్ కాలనీలో మట్కా జూదం ఆడుతున్న తోట రవీందర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి ఒక చరవాణి, రూ. 10,140 ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.