సిద్దిపేట: హుస్నాబాద్ మండలం పందిళ్ల ప్రాంతంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన మారపల్లి తిరుపతి (30)కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ ద్వారా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.