BHPL:ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముగింపు నేపథ్యంలో మొగుళ్లపల్లి మండలంలోని గ్రామ పంచాయతీల్లో జూన్ 4, 6, 8, 10 తేదీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేందర్ అన్నారు. వర్షాకాల సంసిద్ధత, పారిశుద్ధ్యం, తాగునీరు, కాలువల పూడికతీత, వీధి దీపాలు, మొక్కల పెంపకం, పంటల వైవిధ్యం, ఓటరు జాబితా అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.