KMR: కూలీ పనికి వచ్చిన శ్యామల (40) కనిపించకుండా పోయి, కుళ్లిపోయిన స్థితిలో విగతజీవిగా లభ్యమైంది. ఆదివారం భర్త రాజంతో కలిసి పనికి వచ్చిన శ్యామలకు పని దొరకకపోవడంతో ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిపోయింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. బుధవారం రైల్వే ట్రాక్ పక్కన కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.