ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటిస్తే మంచిది. పండ్లు, ఆకుకూరలు, నట్స్ వంటి సమతుల్య ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, చక్కెర తగ్గించాలి. నిత్యం 30 నిమిషాల నడక లేదా యోగా చేయాలి. రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. 7-8 గంటలు నిద్ర తప్పనిసరి. ధ్యానంతో ఒత్తిడి తగ్గించుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, 6 నెలలకోసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి.