సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్ర అధ్యాపకురాలు రొడ్డ ప్రమీలకు డాక్టరేట్ లభించింది. మధ్యప్రదేశ్లోని శ్రీ కృష్ణ విశ్వవిద్యాలయంలో ‘తెలంగాణ ఆటో మొబైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు’ అనే అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనా పత్రానికి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా కళాశాలలో ఆమెకు అభినందన సమావేశం నిర్వహించారు.