ATP: జిల్లాలో వేరుసెనగ విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. 26 మండలాల్లో 1,203 క్వింటాళ్ల విత్తనాల కోసం 1,378 మంది రైతులు నమోదు చేసుకున్నారు. అనంతపురంలోని పది ప్రాసెసింగ్ యూనిట్లలో కాయల శుద్ధి ప్రక్రియ మొదలైంది. శుద్ధి చేసిన 1500 క్వింటాళ్ల విత్తనాలను మండలాలకు తరలించినట్లు జేడీఏ సాలు రెడ్డి తెలిపారు.