కోనసీమ: పట్టణాల్లో మురుగునీటి శుద్ధి కర్మాగారాల (STP) ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని JC నైదియాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో RCPM, ముమ్మిడివరం, అమలాపురం కమిషనర్లు, అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న జనాభా, పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నీటిని శుద్ధి చేయాలన్నారు.