NZB: బోధన్ సమీపంలో గురువారం ఉదయం ఎడపల్లి కొత్త బస్టాండ్ వెనుక సోనీ అనే యాచకురాలు ప్రసవ వేదనతో బాధపడుతుండగా స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించారు. సారంగాపూర్ వద్ద అంబులెన్స్‌ను నిలిపి EMT లక్ష్మణ్, పైలట్ కేశవకుమార్ సుఖప్రసవం చేయించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.