MHBD: జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి గాను 76 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి పాఠశాలలో ఒక ప్రీ-ప్రైమరీ ఇన్స్పెక్టర్, ఒక ఆయా నియామకం చేపట్టనున్నారు. ఇన్స్పెక్టర్కు రూ. 8,000, ఆయాకు రూ. 6,000 వేతనం అందనుంది. జూన్ 3 నుంచి 6 వరకు అర్హులు MEO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.