TG: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్న ఓ ప్రయాణికుడు పట్టుబడటం కలకలం రేపింది. సుడాన్ నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడిని ప్రభుత్వం తాజాగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక హెల్త్ స్కానర్ ద్వారా అధికారులు గుర్తించారు. గతంలో అతనికి ఎబోలా వచ్చిన హిస్టరీ ఉండటంతో, అధికారులు వెంటనే అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తగా అతడిని తిరిగి వెనక్కి పంపించారు.