‘టాక్సిక్’ మూవీ అవుట్పుట్ పట్ల హీరో యష్ అసంతృప్తిగా ఉన్నారని, వందల కోట్ల బడ్జెట్తో మళ్లీ రీషూట్లు చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ, చిత్ర బృందం తీవ్రంగా స్పందించాయి. SMలో వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్లేనని కొట్టిపారేశాయి. సినిమా చిత్రీకరణ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని, ఎలాంటి రీషూట్లు జరగడం లేదని స్పష్టం చేశాయి.